

చెన్నై సూపర్ కింగ్స్‌తో టీమిండియా పేసర్ దీపక్ చహర్ బంధం తెగిపోయింది

ఐపీఎల్ మెగా వేలం-2025 వేలానికి ముందే చహర్‌ను చెన్నై వదిలేసింది

అయితే, వేలంలో మాత్రం అతడిని దక్కించుకునేందుకు పోటీపడింది

కానీ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ చహర్ ధరను రూ. 8 కోట్లకు పెంచిన తర్వాత రేసు నుంచి తప్పుకొంది

ఈ క్రమంలో ముంబై దీపక్ చహర్‌ను రూ. 9 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకుంది

ఈ నేపథ్యంలో దీపక్ చహర్ భార్య జయా భరద్వాజ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది

‘‘స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచడం నుంచి.. ప్రపంచం ముందు నేను ఎస్ చెప్పడం వరకు అంతా అక్కడే జరిగింది.

నా హృదయం ఎల్లప్పుడూ ఈ జట్టుతో ముడిపడి ఉంటుంది. అద్భుతమైన జ్ఞాపకాలు అందించినందుకు ధన్యవాదాలు’’ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జయా భరద్వాజ్ థాంక్స్ చెప్పారు.











