India Vs West Indies 2nd T20: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది.ఫీల్డింగ్ సమయంలో ఆల్‌రౌండర్లు దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్‌లు గాయాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో టి20 మ్యాచ్‌కు వీరు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు టి20 సిరీస్ నుంచి ఔటైన సంగతి తెలిసిందే. వీరు కూడా దూరమైతే టీమిండియా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది.
చదవండి: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్
విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కెప్టెన్ పొలార్డ్ స్వ్కేర్‌లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో చహర్ కుడిచేతికి గాయమయింది. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. మూడు ఓవర్లు వేసిన చహర్ 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చహర్ మిగిలిన ఓవర్‌ను హర్షల్ పటేల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. అయితే గాయం తీవ్రతను బట్టి చహర్ రెండో వన్డే ఆడేది లేనిది తెలుస్తుంది.
ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో పొలార్డ్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో జారిపడడంతో అయ్యర్ కుడిచేతికి గాయం అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించాడు. కాగా వీరిద్దరికి స్కానింగ్ నిర్వహించి.. వచ్చే ఫలితాలను బట్టి రెండో టి20కి అందుబాటులో ఉంటారా.. దూరమవుతారా అనేది ఆసక్తిగా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనుంది.
చదవండి: అరంగేట్రంలో రవి బిష్ణోయి రికార్డు.. కల నిజమైంది.. కానీ ఇది అస్సలు ఊహించలేదు!
Comments
Please login to add a commentAdd a comment