Ind Vs Wi T20: Suryakumar Yadav Motivates Venkatesh Iyer Crucial Stage Of Match 1st T20 - Sakshi
Sakshi News home page

IND VS WI: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్‌ అయ్యర్‌.. వీడియో వైరల్‌

Published Thu, Feb 17 2022 10:45 AM | Last Updated on Thu, Feb 17 2022 12:30 PM

Suryakumar Yadav Motivates Venkatesh Iyer Crucial Stage Of Match 1st T20 - Sakshi

వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి భోణీ కొట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు కడదాకా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్‌ శర్మ(40), ఇషాన్‌ కిషన్‌(35) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి(17 పరుగులు) చేసి ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ కీపర్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాలని భావించాడు. కానీ పంత్‌ నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకోవడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. 

చదవండి: బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌' అని అపవాదు.. ఇప్పుడది పటాపంచలు

ఈ దశలో యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అ‍య్యర్‌ క్రీజులోకి వచ్చాడు. వెంటనే సూర్యకుమార్‌.. అయ్యర్‌తో.. ''వెంకీ మనం మ్యాచ్‌ గెలవాలి.. జాగ్రత్తగా ఆడు'' అని చెప్పడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. సూర్య మాటకు వెంకటేశ్‌ అయ్యర్‌ కట్టుబడి ఆడాడు. చివరి వరకు నిలబడిన అయ్యర్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇక సూర్యకుమార్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

చదవండి: రోహిత్‌ ఆగ్రహానికి గురైన రవి బిష్ణోయ్‌.. తొలి మ్యాచ్‌ కదా వదిలేయ్‌

అంతకముందు బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌ మెరిశాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన బిష్ణోయ్‌.. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అతనికి తోడు మిగతా బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (43 బంతుల్లో 61,4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement