IPL 2022: చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్! గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ దీపక్ చహర్ కాస్త ఆలస్యంగానైనా టీమ్‌లోకి తిరిగి రానున్నాడట. ముందుగా చెప్పినట్లుగా అతడికి సర్జరీ అవసరం లేదని, ఏప్రిల్ రెండో వారం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా మిస్టర్ కూల్ ధోని సారథ్యంలోని సీఎస్‌కే 14 కోట్లు ఖర్చు చేసి దీపక్ చహర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈసారి వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా చహర్ నిలిచాడు. అయితే, వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు తొడ కండరాల గాయానికి గురికావడం, తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని మొదట్లో వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న చహర్‌కు సర్జరీ అవసరం లేదని ట్రెయినర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
రానున్న రెండు వారాల్లోగా అతడు.. జట్టుతో చేరనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. సూరత్‌లో ప్రాక్టీసు చేస్తున్న ధోని సేనతో చహర్ కలువనున్నట్లు తెలిపింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన దీపక్ చహర్ 14 వికెట్లు పడగొట్టి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2022 ఆరంభం కానుంది.
చదవండి: IPL 2022- CSK: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
Namma Special 🦁 Footvolley segment is B⚽CK! 🔁#WhistlePodu pic.twitter.com/pXxIe994sG
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022
Comments
Please login to add a commentAdd a comment