టి20 మ్యాచ్‌ల్లో బౌలర్లు అదరగొట్టే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే తాజా ఐపీఎల్ సీజన్‌లో మాత్రం బౌలర్ల హవా నడుస్తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ప్రధాన పేసర్ దీపక్ చహర్ తన వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్‌ను షార్ట్‌పిచ్ బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్‌స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్‌లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దాంతో సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ను తీసే చాన్స్‌ను చహర్ మిస్ చేసుకున్నాడు. హాక్‌ఐలో బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్‌స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్‌లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది.
ఇక్కడ చదవండి:
సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్
Comments
Please login to add a commentAdd a comment