PC: Disney+Hotstar)
దీపక్ చహర్.... దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో వన్డే ద్వారా తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఈ యువ ఆటగాడు. బంతితోనూ, బ్యాట్‌తనూ అద్భుతంగా రాణించాడు. తొలుత ప్రొటిస్ ఓపెనర్ జానేమన్ మలన్.. ఆ తర్వాత ఎయిడెన్ మార్కరమ్ వికెట్లు తీసి శుభారంభం అందించాడు చహర్. ఆ తర్వాత మ్యాచ్ చేజారిపోయినట్టే అని అభిమానులు ఉసూరుమంటున్న సమయంలో.. నేనున్నా అంటూ బ్యాట్‌తో అద్భుతం చేశాడు. అర్ధ సెంచరీతో రాణించి (34 బంతుల్లోనే 54 పరుగులు) భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.
కానీ... లుంగి ఎంగిడి ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. చహర్‌ను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్ ఇలా వచ్చి అలా వెళ్లాడు. బుమ్రా కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ చహల్, ప్రసిద్ క్రిష్ణ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కు ముగింపు పడింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం చివరకు సౌతాఫ్రికానే వరించింది. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న చహర్ కన్నీళ్లు ఆపులేకపోయాడు. తన అద్భుత ఇన్నింగ్స్ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయిందనే బాధతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తేడాతో భారత్ వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆఖరి వన్డేలో విజయంతో ప్రొటిస్ భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ధావన్, కోహ్లి, చహర్ అర్ధ సెంచరీలు వృథాగా పోయాయి. ముఖ్యంగా చహర్ ఈ మ్యాచ్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... ‘‘దీపక్ మాకు గెలిచే అవకాశాన్ని ఇచ్చాడు. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి నిరాశ తప్పలేదు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Virat Kohli- Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన కోహ్లి...
Sport 💔 pic.twitter.com/3MPTptkc04
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 24, 2022
Red ball is fun ☺️ #TeamIndia #BleedBlue pic.twitter.com/eRkF0PupYk
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 22, 2021
Comments
Please login to add a commentAdd a comment