Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు మిస్ అయిన స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్.. ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ నాటికి సిద్ధంగా ఉంటాడని సీఎస్‌కే యాజమాన్యం సూచనప్రాయంగా వెల్లడించింది. పంజాబ్‌తో మ్యాచ్ నాటికి ఫిట్‌గా ఉండేందుకు చాహర్ ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టాడు. జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నాడు.
కాగా, ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఓడిన రెండు మ్యాచ్‌ల్లో చాహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 2021 సీజన్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన చాహర్‌ను సీఎస్‌కే ఏరికోరి మరీ 14 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. చాహర్ త్వరగా కోలుకుని బరిలోకి దిగాలని అభిమానులతో పాటు సీఎస్‌కే యాజమాన్యం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ (ఏప్రిల్ 3) తమ మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సీఎస్‌కే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
చదవండి: IPL 2022: ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత
Comments
Please login to add a commentAdd a comment