IND Vs SL T20I Series: Deepak Chahar Out Of Sri Lanka T20 Series, Report Says - Sakshi
Sakshi News home page

IND Vs SL: గాయంతో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం

Published Tue, Feb 22 2022 9:15 PM | Last Updated on Wed, Feb 23 2022 9:12 AM

IND Vs SL: Deepak Chahar Out Of Sri Lanka T20 Series - Sakshi

Deepak Chahar: త్వ‌ర‌లో శ్రీలంకతో జ‌ర‌గనున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ దీపక్ చాహర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. చాహ‌ర్‌ టీమిండియా బ‌యోబ‌బుల్‌ను వీడాడ‌ని స‌మాచారం. లంక‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో చాహ‌ర్ స‌భ్యుడిగా ఉన్నాడు. 

వెస్టిండీస్‌తో ఆఖ‌రి టీ20 సంద‌ర్భంగా చాహ‌ర్‌ గాయ‌ప‌డిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండో ఓవ‌ర్ బౌలింగ్ చేస్తుండ‌గా కుడి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో చాహ‌ర్ మైదానాన్ని వీడాడు. వైద్యుల ప‌రీక్షఅనంత‌రం గాయం తీవ్ర‌మైంద‌ని తెలిసింది. కోలుకునేందుకు 5-6 వారాల ప‌ట్టవ‌చ్చ‌ని స‌మాచారం. ఈ వార్త తెలిసి చాహ‌ర్ ఐపీఎల్ జ‌ట్టు చెన్నైసూపర్ కింగ్స్ ఉలిక్కిప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే చాహ‌ర్‌ను ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఇదిలా ఉంటే, లంక‌తో టీ20 సిరీస్ ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ప్రారంభం కానుంది. లక్నో వేదిక‌గా తొలి టీ20, ఫిబ్ర‌వ‌రి 26, 27 తేదీల్లో ధ‌ర్మ‌శాల వేదిక‌గా రెండు, మూడు టీ20లు జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం మార్చి 4-8 వ‌ర‌కు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వ‌ర‌కు బెంగ‌ళూరు వేదిక‌గా రెండో టెస్టు(డే అండ్ నైట్) జ‌ర‌గ‌నుంది. 
చ‌ద‌వండి: టీమిండియా క్రికెట‌ర్ల‌కు అవమానం.. వ్యాక్సిన్ వేసుకోలేద‌ని..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement