నాగ్‌పూర్: సహచర క్రికెటర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకడు. తాను నమ్మిన క్రికెటర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వారి నుంచి ఫలితాలు రాబట్టడంలో ధోని సిద్ధహస్తుడు. ఇలా ధోని తయారు చేసిన ఒక మెరికే దీపక్ చాహర్. ఈ విషయాన్ని చాహరే ఒప్పుకున్నాడు. తాను ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డును ఎంజాయ్ చేస్తున్నానంటే అందుకు ధోని కారణమన్నాడు. తాను ఐపీఎల్‌లో ధోని నేతృత్వంలో సీఎస్‌కే ఆడటం అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంతగానో లాభించిందన్నాడు. ‘ నా ప్రతిభ వెలుగులోకి రావడం ముందుగా చెప్పుకోవాల్సింది ఐపీఎల్. అందులోనూ ధోని సారథ్యంలో సీఎస్‌కే ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా.
ప్రధానంగా ధోని భాయ్ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు. ప్రధానం బ్యాట్స్‌మన్ బాడీ లాంగ్వెజ్‌ను తొందరగా అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా సన్నిద్ధం కావడానికి సీఎస్‌కేతో పాటు ధోనిలే కారణం. ధోనిని నన్ను ఎక్కువగా ప్రోత్సహించేవాడు. నా బౌలింగ్‌పై నమ్మకం ఉంచి పదే పదే నాకు బౌలింగ్ అప్పచెప్పేవాడు. అదే నన్ను రాటుదేలేలా చేసింది. అతను వికెట్ల వెనుక నుంచి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. బ్యాట్స్‌మన్ ఏ రకంగా ఆడుతున్నాడు అనే విషయాన్ని గమనిస్తాడు. ఇలా చాలా సార్లు నాకు చెప్పడం, అందుకు తగ్గట్టు బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసేవాడిని. అలా బ్యాట్స్‌మన్ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది’ అని చాహర్ పేర్కొన్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో ఆరు వికెట్లతో చెలరేగిపోయిన చాహర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఒక హ్యాట్రిక్‌తో పాటు ఒత్తిడిలో ప్రధాన వికెట్లను ఖాతాలో వేసుకుని భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment