
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ముగిసిన తర్వాత ధోని పెవిలియన్ వైపు నడుస్తున్న సమయంలో దీపక్ చహర్ కనిపించాడు. అయితే ధోని పోతూ పోతూ చహర్‌వైపు సీరియస్ లుక్స్ ఇచ్చాడు.
ఆ తర్వాత అతని పక్కనుంచి వెళ్లిన ధోని.. చహర్ తలపై కొట్టినంత పని చేశాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన చహర్ ధోని వైపు తిరగ్గా.. సీఎస్‌కే కెప్టెన్ అతని వైపు చూడకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. 'అమ్మ ధోని.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా' అంటూ ఫన్నీగా పేర్కొన్నారు.
ధోని.. చహర్‌ను కొట్టడం అనేది ఫన్నీవేలోనే చేసినప్పటికి అభిమానులు మాత్రం తమకు నచ్చింది ఊహించుకున్నారు.''ఈ సీజన్‌లో చహర్ ప్రదర్శన పట్ల ధోని అసంతృప్తిగా ఉన్నాడు.. అందుకే ఇలా చేశాడు.. ఒక సీఎస్‌కే అభిమాని చహర్‌పై ఎంత కోపంగా ఉన్నాడనేది ధోని చూపించాడు'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్‌లో గాయంతో చహర్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. రెండో అంచె పోటీల్లో ఆడుతున్న చహర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు.
Thala expressing what every CSK fan feel about chahar 😂😂😂#CSKvDC #Dhoni #shivamdube #rayudu pic.twitter.com/IuYyLvE9MR
— Mr Leo (@mrleooffl) May 10, 2023