ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్ దీపక్ చాహర్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అఖరి నిమిషంలో తన మనసును చాహర్ మార్చుకున్నాడు.
జరిగిందంటే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో తొలి బంతి వేయడానికి దీపక్ చాహర్ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ట్రిస్టాన్ స్టబ్స్.. బౌలర్‌ను గమనించకుండా క్రీజు వదిలి చాలా దూరం ముందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన చాహర్.. బంతిని వేయకుండా ఆపేసి రనౌట్ చేస్తానని నవ్వుతూ హెచ్చరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీపక్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక భారత స్టార్ మహిళా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. మూడో వన్డే సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ చార్లీ డీన్‌ను రనౌట్ (మన్కడింగ్) చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రనౌట్‌పై రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదు.
Not Mankading!
— Narasimha R N (@NarasimhaRN5) October 4, 2022
The ever smiling and dashing Deepak Chahar maintains the rule, law, spirit, fairness, glory and beauty of cricket!
Respect ✊
#INDvSA #ICC2022 #BCCI #CricketTwitter #respect #chennaisuperkings #mankad pic.twitter.com/8pT4SXleEY
చదవండి: IND Vs SA: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment