ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత-ఏ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ పేసర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు.
వీరిద్దరికి తోడు మరో స్పిన్నర్ నిషాంత్ సింధు, పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్ రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ, పాక్- ఏ జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్ డకౌట్
ఈ క్రమంలో హంగర్గేకర్ పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేయడంతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌ను కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకునే ప్రయత్నం చేశారు.
48 ఓవర్లలోనే కథ ముగిసింది
అయితే, మానవ్ సుతార్, హంగేర్గకర్ ధాటికి వరుసగా వికెట్లు పడ్డాయి. టాపార్డర్ విఫలమైన వేళ లోయర్ ఆర్డర్‌లో వచ్చిన కాసిం అక్రమ్(48), ముబాసిర్ ఖాన్(28) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అయితే, భారత బౌలర్ల ధాటికి 48 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 205 పరుగులు చేసి దాయది జట్టు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యశ్ ధుల్ సేన గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దూకింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. యూఏఈ, నేపాల్‌లపై వరుసగా 8, 9 వికెట్ల తేడాతో గెలుపొంది. చిరకాల ప్రత్యర్థిపై కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది.
చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
విండీస్‌తో రెండో టెస్టు! కీలక అప్‌డేట్ ఇచ్చిన రోహిత్!; వాళ్లకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment