U 19 WC Star CSK Young Player Accused Of Age Fraud: అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాజ్‌వర్ధన్ హంగర్కర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. వయసును తక్కువగా చూపించి అతడు మోసానికి పాల్పడ్డాంటూ మహారాష్ట్ర క్రీడా, యువజన విభాగం కమిషనర్ ఓం ప్రకాశ్ బకోరియా ఆరోపించారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి లేఖ రాసినట్లు స్థానిక సామ్నా పత్రిక కథనం వెలువరించింది.
కాగా ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌ను యశ్ ధుల్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్‌వర్ధన్ హంగర్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ప్రపంచకప్ టోర్నీలో మెరుగ్గా రాణించిన నేపథ్యంలో పలువురు అండర్ 19 ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం-2022లో మంచి ధర పలికిన సంగతి తెలిసిందే.
ఆక్షన్‌లో భాగంగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై ఫ్రాంఛైజీ 1.5 కోట్లు వెచ్చించి రాజ్‌వర్ధన్‌ను కొనుగోలు చేసింది. గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగల ఈ యువ ఫాస్ట్ బౌలర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ రాజ్‌వర్ధన్‌పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘‘ధారాశివ్ సీఈఓ రాహుల్ గుప్తా రాజవర్ధన్ హంగర్కర్ పుట్టిన తేదీ వివరాల గురించి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ధారాశివ్ పబ్లిక్ స్కూల్‌లో ఉన్న వివరాల ప్రకారం అతడు 2001 జనవరి 10న జన్మించినట్లు రాశారు. అయితే, అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు దీనిని 2002 నవంబరు 10గా మార్చినట్లు ఉంది’’ అని ఓం ప్రకాశ్ తన లేఖలో బీసీసీఐకి వివరించారు.
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘అవును... మహారాష్ట్ర నుంచి మాకు లేఖ అందింది. ఆ ఆటగాడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై మేము దృష్టి సారించాం. అయితే, ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. లోతుగా దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు.
చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!
Some Cricketers are playing Cricket with fabricated Date of Birth Certificate. Cricketers who Indulge in a fraud in DOB not only violate core values of Crocket but also put genuine Cricketers in a disadvantages position. It’s against the integrity of sports.@bcci @SGanguly99
— Om Prakash Bakoria (@ombakoria) February 14, 2022
Comments
Please login to add a commentAdd a comment