ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. గాయం కారణంగా సీజన్ తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమైన కాన్వే.. ఇప్పుడు సీజన్ మొత్తానికే దూరం కావడం ఆ జట్టుపై పెను ప్రభావం పడనుంది.
కాన్వే గత రెండు సీజన్లుగా సీఎస్‌కేలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్‌కే మరో టైటిల్ దిశగా అడుగులు వేసే క్రమంలో కాన్వే లాంటి ఆటగాడు అందుబాటు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. కాన్వే సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 18) అధికారికంగా ప్రకటించింది. కాన్వేకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. గ్లీసన్‌ను సీఎస్‌కే కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది.
కాగా, సీఎస్‌కే ప్రస్తుత సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. కొత్త సారధి రుతురాజ్ సారధ్యంలో సీఎస్‌కే గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ జట్టు రేపు (ఏప్రిల్ 19) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
Richard Gleeson - The new Super King🦁pic.twitter.com/ZPvNldEqLw
— CricTracker (@Cricketracker) April 18, 2024
Welcome To CSK, RICHARD GLEESON 🦁💛
— 🜲 (@balltamperrer) April 18, 2024
Dismissed Rohit Sharma, Virat Kohli and Rishabh Pant within his first eight balls on debut. 🔥pic.twitter.com/rF7FAnSskk
Comments
Please login to add a commentAdd a comment