
PC: IPL(ధోనితో కాన్వే)
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, కివీస్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాన్వే ప్రస్తుతం చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 సం డెవాన్ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. .దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.
స్కానింగ్‌కు తరలించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో వైద్యులు అతడికి సర్జరీ అవసరమని సూచించారు. కాన్వే చేతి వేలికి త్వరలోనే శస్త్రచికిత్స జరగనుంది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స అనంతరం అతడికి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి వైద్యులు తెలిపినట్లు సమాచారం.
అంటే మే వరకు కాన్వే అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి డెవాన్ దూరం కానున్నాడు. కాగా గతేడాది సీఎస్‌కే ఛాంపియన్స్‌గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డెవాన్ నిలిచాడు.
అటువంటి అద్బుతమైన ఆటగాడు దూరం కావడం సీఎస్‌కేకు నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ఈ సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
చదవండి: Shreyas Iyer: కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్ అయ్యర్! స్టంప్స్ ఎగిరిపోయాయిగా
Comments
Please login to add a commentAdd a comment