PC: IPL
IPL 2022 Auction: చెన్నె సూపర్‌కింగ్స్... ఈ ఐపీఎల్ జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలో నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచింది సూపర్‌కింగ్స్. డాడ్స్ టీమ్ అంటూ ఎగతాళి చేసిన వాళ్లకు వరుస విజయాలతోనే సమాధానమిచ్చి ధీటుగా నిలబడింది. ఆటగాళ్లంతా కుటుంబంలా మెదిలే.. అద్భుతమైన సలహాలు ఇచ్చే ధోని కెప్టెన్‌గా ఉండే ఈ జట్టులో భాగం కావాలని క్రికెటర్లు కోరుకోవడం సహజమే.
ముఖ్యంగా ఇప్పటికే చెన్నై తరఫున ఆడిన వాళ్లు తిరిగి జట్టుతో చేరేందుకు ఆసక్తి చూపడంలో సందేహం లేదు. ఈ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు ఈ ఆటగాళ్లు.ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో సీఎస్‌కే జడేజా (రూ. 16 కోట్లు), ధోని (రూ. 12 కోట్లు) , మొయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జట్టుతో అనుబంధం పెనవేసుకున్న బ్రావో, ఊతప్ప, రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు తదితర క్రికెటర్లు మాత్రం తమను వదిలేసినా సరే.. ఆ జట్టుకే ఆడటాన్ని ఇష్టపడతామని చెప్పుకొచ్చారు.
విండీస్ ఆల్‌రౌండర్ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బౌలర్‌గా.. కీలక సమయాల్లో పరుగులు రాబట్టే బ్యాటర్‌గా తన వంతు బాధ్యత నెరవేర్చాడు. ట్రోఫీ విజేతగా నిలిచిన మూడు పర్యాయాల్లో అతడు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, కేవలం నలుగురినే అట్టిపెట్టుకోవాలనే నిబంధన దృష్ట్యా సీఎస్‌కే అతడిని వదిలేసింది.
ఈ నేపథ్యంలో బ్రావో మాట్లాడుతూ.. ‘‘సీఎస్‌కే నన్ను రిటైన్ చేసుకోలేదు. కానీ.. నేను వేలంలో ఉంటాను కదా. ఏ జట్టు నన్ను కొనుగోలు చేస్తుందో చెప్పలేను. ఒకవేళ సీఎస్‌కే నన్ను తీసుకుంటుందేమో చూడాలి. ఏదైతేనేమి నేను కచ్చితంగా వేలంలోకి వస్తాను కదా’’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక అంబటి రాయుడు సైతం.. చెన్నైకి ఆడటాన్ని ఇష్టపడతానని ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఒకవేళ మెగా వేలంలో చెన్నై తనను కొనుగోలు చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఊతప్ప సైతం రైనాతో పాటు డుప్లెసిస్‌ను కూడా సీఎస్‌కే రిటైన్ చేసుకుంటుందని భావించానని, అయితే అలా జరుగలేదని పేర్నొన్నాడు. ఏదేమైనా వేలంలో తమకు అవకాశం వస్తే మాత్రం తప్పక చెన్నైకి ఆడటాన్ని ఆస్వాదిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ సైతం సీఎస్‌కేకు ఆడాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: Ind Vs Sa ODI Series: ఎట్టకేలకు ధావన్, అశూ జట్టులోకి... తనొక సంచలనం.. కానీ తుది జట్టులో ఉండకపోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment