PC:IPL.com
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్ల�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అ�...
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్�...
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్స�...
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళ�...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్�...
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంత...
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం...
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత�...
Published Mon, Apr 25 2022 6:51 PM | Last Updated on Tue, Apr 26 2022 12:06 AM
PC:IPL.com
పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి చవిచూసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో రాయుడు 78 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్,సందీప్ శర్మ తలా ఒక్కవికెట్ సాధించారు.
153 పరుగులు వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన రాయుడు కీలక సమయంలో ఔటయ్యాడు. సీఎస్కే విజయానికి 12 బంతుల్లో 35 పరుగులు కావాలి.
16 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 131/4. క్రీజులో రాయుడు(75), జడేజా(4) పరుగులతో ఉన్నారు. సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి.
89 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన గైక్వాడ్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 90/4
చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సాంట్నర్.. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 32/2
10 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రాబిన్ ఊతప్ప.. సందీప్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజలో గైక్వాడ్, సాంట్నర్ ఉన్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(88) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో బ్రావో రెండు, తీక్షణ ఒక వికెట్ సాధించాడు.
142 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన రాజపాక్స.. బ్రావో బౌలింగ్‌లో ఔటయ్యాడు.
17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(73), రాజపాక్స(42) పరుగులతో ఉన్నారు.
13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(46), రాజపాక్స(28) పరుగులతో ఉన్నారు.
9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి పంజాబ్ కింగ్స్ 63 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(26), రాజపాక్స(12) పరుగులతో ఉన్నారు.
37 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగుల చేసిన మయాంక్ అగర్వాల్.. తీక్షణ బౌలింగ్‌లో దుబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(10), శిఖర్ ధావన్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment