టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది.. ఈ క్రమంలో హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27గా బీసీసీఐ నిర్ణయించింది. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.
అతడి నేతృత్వంలోనే సీఎస్‌కే ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదే చూడాలి. బీసీసీ రూల్స్ ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్‌లో భారత జట్టును ముందుకు నడిపించాలి.
అదే విధంగా ఏడాదికి 10 నెలల పాటు జట్టుతో పాటు ఉండాలి. ఒకవేళ ఫ్లెమింగ్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడితే సీఎస్‌కే ఫ్రాంచైజీతో బంధం తెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా హెడ్ కోచ్ రేసులో ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment