రాజ్‌వర్ధన్ హంగర్కర్(PC: IPL/CSK)
IPL 2022 RR Vs CSK: అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు రాజ్‌వర్ధన్ హంగర్కర్. ఐసీసీ మెగా ఈవెంట్‌లో బంతితోనూ.. బ్యాట్‌తోనూ రాణించిన ఈ యువ ఆటగాడిని ఐపీఎల్-2022 మెగా వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్ 1.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, ఇంతవరకు అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.
ఇక ఈ సీజన్‌లో ఘోర వైఫల్యంతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ధోని సేన శుక్రవారం(మే 20) తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ రాజ్‌వర్ధన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కనీసం ఆఖరి పోరులోలైనా అతడిని భాగం చేయాలని సూచించాడు.
రాజ్‌వర్ధన్ హంగర్కర్(ఫైల్ ఫొటో)
ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వాళ్లు కొత్త కాంబినేషన్లు ట్రై చేయవచ్చు. అయితే, అదెలా ఉంటుందో మనం ఊహించలేము. నాకైతే ప్రశాంత్ సోలంకి స్థానంలో రాజ్‌వర్ధన్ హంగర్కర్ తుదిజట్టులోకి వస్తే చూడాలని ఉంది.
ధోని అతడికి అవకాశం ఇస్తాడని భావిస్తున్నా. ఒకవేళ రాజ్‌వర్ధన్ ఫిట్‌గా ఉండి.. అతడికి ఛాన్స్ వస్తే కచ్చితంగా తనను తాను నిరూపించుకోగలడు’’ అని క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో సీఎస్‌కే దారుణంగా విఫలమైంది.
తొలుత రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పజెప్పిన యాజమాన్యం.. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఎంఎస్ ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఆఖరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
చదవండి👉🏾Matthew Wade: డ్రెస్సింగ్ రూమ్ వినాశనం; వార్నింగ్‌తో సరి..
Comments
Please login to add a commentAdd a comment