
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 248 బంతులు ఎదుర్కొన్న ఈశ్వరన్ 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 157 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే ముస్ఫిక్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈశ్వరన్‌కు బంగ్లా పర్యటనలో ఇది వరుసగా రెండో సెంచరీ.
ఇక అతడితో పాటు చెతేశ్వర్ పుజారా (52), శ్రీకర్ భరత్(77) పరుగులతో రాణించారు. 110 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుకు 159 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. క్రీజులో జయంత్ యాదవ్, సూరభ్ కుమార్ ఉన్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు.
చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు