(Photo Source: IPL/BCCI)
ముంబై: పరిమితంగా జరిగిన దేశవాళీ టోర్నీలతో పాటు, ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మెరిసిన హైదరాబాదీ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ భారత ‘ఎ’ జట్టులోకి ఎంపికయ్యాడు. ఇందులో ఆంధ్ర వికెట్ కీపర్–బ్యాటర్ శ్రీకర్ భరత్‌కు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఈ జట్టు భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.
సెప్టెంబర్ 1 నుంచి బెంగళూరు, హుబ్లీ వేదికగా మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. అనంతరం ఇరు జట్ల మధ్య చెన్నైలో వన్డే సిరీస్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో తలపడే జట్టును మాత్రమే ఎంపిక చేశారు. వన్డే జట్టును తర్వాత ఎంపిక చేయనున్నట్లు ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి.
భారత్ ‘ఎ’ జట్టు: ప్రియాంక్ పాంచల్ (కెప్టెన్), తిలక్ వర్మ, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మలిక్, ముకేశ్ కుమార్, యశ్ దయాళ్, అర్జాన్ నాగ్‌వాస్‌వాలా.
చదవండి: న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్!
Comments
Please login to add a commentAdd a comment