అరే..అంపైర్ భలే కవర్ చేశాడే! | umpire Gaffaney is raising his finger, and then goes on to scratch his head | Sakshi
Sakshi News home page

అరే..అంపైర్ భలే కవర్ చేశాడే!

Published Sun, Mar 19 2017 1:37 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

అరే..అంపైర్ భలే కవర్ చేశాడే!

అరే..అంపైర్ భలే కవర్ చేశాడే!

రాంచీ: క్రికెట్  ఫీల్డ్లో ఆటగాళ్లు తడబడటం చూస్తూ ఉంటాం. అటు బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ ఫీల్డింగ్ చేసేటప్పుడు క్రికెటర్లు తడబడటం అనేది సర్వ సాధారణం. అయితే ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అంపైర్ తొలుత తడబడి ఆపై నాలుక కరుచుకున్న ఘటన అభిమానుల్లో నవ్వులు పూయించింది.

అసలు విషయమేమిటంటే..భారత్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గో రోజు ఆటలో ఆసీస్ పేసర్ హజల్ వుడ్ 140వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో చటేశ్వర పుజారా బ్యాటింగ్ ఎండ్లో ఉన్నాడు. అయితే ఆ ఓవర్ నాల్గో బంతి లెగ్ స్టంప్ వైపు బౌన్స్ అవుతూ వచ్చింది. దాన్ని పుజారా హుక్ షాట్ కు యత్నించి విఫలమయ్యాడు. కాగా, అంపైర్ గఫానీ మాత్రం ఆ బంతికి కాస్త భిన్నంగా స్పందించాడు. బౌలర్ హజల్ వుడ్ ఎటువంటి అప్పీలు చేయకుండానే తన వేలిని ముందుగా పైకెత్తేసి ఆపై బుర్ర గోక్కున్నాడు. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు అంపైర్ భలే కవర్ చేశాడే అనుకుంటూ సరదాగా నవ్వుకున్నారు. అయితే స్లిప్ లో ఉన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎందుకు వేలెత్తారు అనే అర్థం వచ్చేలా అక్కడ్నుంచే సైగ చేయడం ఇక్కడ గమనార్హం. అందుకు సమాధానంగా తన తలను గోక్కోవడానికి అంటూ అంపైర్ సంకేతాలివ్వడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement