లీడ్స్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను తన షాట్‌తో భయపెట్టాడు. మూడో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 79వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. మొయిన్ అలీ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని పుజారా స్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. అయితే పుజారా బ్యాక్‌ఫుట్ తీసుకొని బంతిని బలంగా బాదడంతో సెకన్ల వ్యవధిలోనే బౌండరీ లైన్‌కు వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కిందకు వంగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఒకవేళ అంపైర్ అలాగే నిల్చొని ఉంటే తల ఖాయంగా పగిలి ఉండేది. పుజారా కొట్టిన ఆ షాట్ గంటకు 98 కిమీ వేగంతో వెళ్లినట్లు తర్వాత మీటర్ రీడింగ్‌లో చూపించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బంతి ఎంత వేగంగా వెళ్లిందనేది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో ఉంది.. మీరు ఒక లుక్కేయండి.
చదవండి: పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్ పోయింది: వాన్
ఇక పుజారా తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమే ఇచ్చాడు. 11 ఇన్నింగ్స్‌ల నుంచి కనీసం అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయిన పుజారా కీలకదశలో రాణించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచినా పుజారా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనదైన మార్క్ చూపించాడు. ఓపెనర్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తన శైలికి భిన్నంగా వేగంగా ఆడుతూ 180 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇంకా 139 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా నాలుగోరోజు ఇంగ్లండ్ బౌలర్లను రోజు మొత్తం నిలువరించాల్సి ఉంది. పుజారా 91, కోహ్లి 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 59 పరుగులు చేసి ఔటయ్యాడు.
ENG Vs IND: స్పిన్ బౌలింగ్.. అందరూ హెల్మెట్లతోనే, కారణం అదే
ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో
— Sportzhustle_Squad (@sportzhustle) August 27, 2021
Comments
Please login to add a commentAdd a comment