లండన్: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. వోక్స్ వేసిన బంతి ఇన్‌స్వింగ్ అయి రహానే ప్యాడ్లను తాకడంతో అప్పీల్ చేశాడు. అది క్లీన్ ఔట్ అని తేలడంతో అంపైర్ ఔటిచ్చాడు. అయితే తన ఔట్‌పై సందేహం వచ్చిన రహానే రివ్యూ కోరాడు. అప్పటికి కోహ్లి రివ్యూకు వెళ్లొద్దని రహానేకు చెప్పినా వినిపించుకోలేదు. రివ్యూలోనూ అదే ఫలితం పునరావృతం కావడంతో రహానే నిరాశగా వెనుదిరిగాడు.
చదవండి: IND Vs ENG 4th Test: కేఎల్ రాహుల్‌కు జరిమానా..
రహానే డకౌట్ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండో టెస్టులో మాత్రమే అర్థసెంచరీ మార్క్ అందుకున్న రహానే మిగతా అన్నిసార్లు దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్టులు కలిపి రహానే వరుసగా 5,1, 61, 18, 10 పరుగులు చేశాడు. దీంతో అతని ఆటతీరుపై టీమిండియా ప్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు.'' రహానేకు టైం దగ్గరపడింది.. రహానే స్థానంలో వేరొకరిని తీసుకోండి.. రహానే ఎందుకిలా.. అంటూ కామెంట్లు చేశారు. రహానే ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Rohith Sharma: రోహిత్ సెంచరీ.. భార్య రితికా ముద్దుల వర్షం
Rahane's poor form continues 😓
— JioTV+ (@jiotvplus) September 5, 2021
The vice-captain departs for a 🦆
Tune into #SonyLIV | JioTV+ 📺#ENGvIND #AjinkyaRahane #Wicket
pic.twitter.com/Gc9WetmTfF
#ENGvIND
— Shivani (@meme_ki_diwani) September 5, 2021
Rahane before this post
5,1,61
Rahane after this post
18,10,14,0
Troll us man ploxxxx pic.twitter.com/ti3MT5QryL
Rahane sahab only consistent batsman in this team. Pitch, condition doesn't matter to him. Shit everywhere 👏👏
— Rahul (@Ittzz_Rahul) September 5, 2021
Comments
Please login to add a commentAdd a comment