
పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పొలొసక్ అరుదైన ఘనత సాధించింది. శనివారం నమీబియా, ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 మ్యాచ్‌కు 31 ఏళ్ల క్లైర్ అంపైర్‌గా వ్యవహరించింది. క్లైర్ గత రెండున్నరేళ్లలో మహిళల క్రికెట్‌లో 15 వన్డేలకు అంపైరింగ్ చేసింది. వీటిలో 2017 ప్రపంచ కప్ మ్యాచ్‌లు, గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీస్ వంటి కీలకమైనవి ఉన్నాయి.
దేశవాళీల్లోనూ పురుషుల మ్యాచ్ (2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ‘ఎ’)కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా క్లైర్ ఘనతకెక్కింది. దీనిపై ఆమె స్పందిస్తూ... ‘మహిళలు అంపైర్లుగా చేయకూడదని ఏమీ లేదు. మహిళా అంపైర్ల వ్యవస్థను ప్రోత్సహించాలి. చైతన్యం కల్పిస్తే... అడ్డంకులన్నీ దాటుకుని మరింతమంది అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తారు’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment