Claire
-
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా!
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారి తొలగింపు కథనాలు, కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో లింక్డ్ఇన్ వంటి సామాజిక వేదికలు నిండిపోయాయి. కొంతమంది ఇప్పటికే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోగా మరికొందరు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ, మంచి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మంచి నైపుణ్యాలు కావాలి. ఇంటర్వ్యూల్లో చూసేది ఇదే.. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ టాప్ సీక్రెట్ చెప్పారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో రిక్రూటర్లు అభ్యర్థులలో ఆశించే టాప్ స్కిల్ ఏంటో ఆమె బయటపెట్టారంటూ సీఎన్‌బీసీ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఓ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అభ్యర్థుల్లో రిక్రూటర్లు చూసే అత్యుత్తమ నైపుణ్యం స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్). ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! క్లైర్.. గూగుల్‌లో తన పదేళ్ల సుదీర్ఘ అనుభవంలో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు స్వీయ-అవగాహన ఎంత మేరకు కలిగి ఉన్నారో చేసేవారు. దాని ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. వారంలో 40 గంటలు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ఆమె వెచ్చించేవారు. ఈ సమయంలో తాను అభ్యర్థులలో అన్నింటికంటే ముందు చూసే ఒక నైపుణ్యం స్వీయ-అవగాహన అని ఆమె పేర్కొన్నారు. పని అనుభవం, ఇతర నైపుణ్యాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటిని నిదానంగా తెలుసుకోవచ్చన్నారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! క్లైర్ మాటల ప్రకారం.. ఇలా స్వీయ అవగాహన కలిగి ఉన్న వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపుతారు. చేయాల్సిన పని గురించి నిజాయితీగా ఉంటారు. సహోద్యోగులు, ఉన్నతోద్యోగులతో మెరుగైన సంబంధం కలిగి ఉంటారు. స్వీయ-అవగాహన అనేది ఒక 'అరుదైన' లక్షణం. ఓ పరిశోధన ప్రకారం.. 95 శాతం మంది అభ్యర్థులు తమకు స్వీయ-అవగాహన ఉందని భావిస్తారు. కానీ వాస్తవానికి 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. -
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
పురుషుల మ్యాచ్‌కు తొలిసారి మహిళా అంపైర్
పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పొలొసక్ అరుదైన ఘనత సాధించింది. శనివారం నమీబియా, ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 మ్యాచ్‌కు 31 ఏళ్ల క్లైర్ అంపైర్‌గా వ్యవహరించింది. క్లైర్ గత రెండున్నరేళ్లలో మహిళల క్రికెట్లో 15 వన్డేలకు అంపైరింగ్ చేసింది. వీటిలో 2017 ప్రపంచ కప్ మ్యాచ్‌లు, గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీస్ వంటి కీలకమైనవి ఉన్నాయి. దేశవాళీల్లోనూ పురుషుల మ్యాచ్ (2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ‘ఎ’)కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా క్లైర్ ఘనతకెక్కింది. దీనిపై ఆమె స్పందిస్తూ... ‘మహిళలు అంపైర్లుగా చేయకూడదని ఏమీ లేదు. మహిళా అంపైర్ల వ్యవస్థను ప్రోత్సహించాలి. చైతన్యం కల్పిస్తే... అడ్డంకులన్నీ దాటుకుని మరింతమంది అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తారు’ అని పేర్కొంది. -
దురలవాట్లకు దూరంగా...
చేతి నిండా డబ్బు... ఏం చేయాలో తెలియక... విచ్చలవిడిగా ఖర్చుచేయడం... తప్పుదోవ పట్టడం... దురలవాట్లకు వృథా చేయడం... కొన్ని రోజులు గడిచాక... జీవితంలో అనుకోని సంఘటన ఎదురుకావడంతో... పరివర్తన కలగడం... ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని మణికంఠ తీసిన లఘుచిత్రం ‘అహల్య’ డెరైక్టర్స్ వాయిస్: మాది కడప జిల్లా, చిన్నమండెం గ్రామం. నేను బి.టెక్ పూర్తి చేసి, ప్రస్తుతం నిజాం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎం.టెక్ చేస్తున్నాను. ఈ సినిమాకి మా స్నేహితులు బాగా సపోర్ట్ చేశారనడం కంటె, నా వెనుకే ఉంటూ, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ , ఏ విషయంలోనూ నేను డిజప్పాయింట్ కాకుండా చూసుకుంటూ వచ్చారు. ప్రస్తుత కాలంలో అమ్మానాన్నలు... బాగా డబ్బు సంపాదించేసి, తమ పిల్లలు బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో పిల్లలు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక పిల్లలు అడ్డదారుల్లోకి వెళ్లి చెడిపోతున్నారు. అలాంటివి కాస్త తగ్గాలి. తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల మీద కొంత శ్రద్ధ తీసుకుంటేనే మంచిదని కోరుకుంటున్నాను. ఎవరికీ సూక్తులు, సందేశాలు నచ్చవు. ఇప్పుడుండే జనరేషన్ సందేశం ఇచ్చేవారిని పనిలేనివాళ్లలా జమ కట్టేస్తున్నారు. అందువల్ల నేను ఎవరికీ సందేశం ఇవ్వదల్చుకోలేదు. ‘మనలో ముందు మార్పు రావాలి, తర్వాత పక్కన వాళ్లకి చెప్పాలి’ అన్నది నా ఉద్దేశ్యం. షార్ట్ స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఉంటారు. వారిద్దరికీ కొన్ని దురలవాట్లు ఉంటాయి. ఒకసారి ఒక మిత్రుడు బాగా మద్యం సేవించి, ‘అమ్మాయి కావాలి’ అని మిత్రుడిని అడుగుతాడు. వెంటనే ఒక అమ్మాయిని తీసుకువస్తాడు. వచ్చిన అమ్మాయికి ఆకలిగా ఉండటంతో గబగబ వంటగదిలోకి వెళ్లి అన్నం తింటూ ఉంటుంది. అది చూసిన వెంటనే అతడిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తనకు కావలసినంత డబ్బు ఉండటంతో, మంచిచెడుల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నానని బాధ పడతాడు. వెంటనే ఆ అమ్మాయికి కొంత డబ్బు ఇచ్చి, పిల్లలకు ఏదైనా కొనిపెట్టమని చెప్పి పంపేస్తాడు. స్థూలంగా ఇదీ కథ. కామెంట్: లఘుచిత్రాలలో ఇటువంటి అంశం మీద చిత్రాలు నిర్మించినవారు తక్కువే అని చెప్పవచ్చు. ఇంత చిన్న వయసు (23 సంవత్సరాలు) లో ఇంత మంచి ఆశయంతో లఘుచిత్రం నిర్మించినందుకు మణికంఠను అభినందించాలి. నటీనటులు మరికాస్త బాగా నటించాలి. చిత్రంలో మరింత పర్ఫెక్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది. సినిమా టేకింగ్, ఎడిటింగ్, ఎక్స్ప్రెషన్స్, కెమెరా... వంటివన్నీ బాగున్నాయి. డైలాగులు అంత ఎక్కువ లేవు. ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా తీసుకుని తీసిన లఘుచిత్రం కనుక, అంశం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. - డా.వైజయంతి