ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. జూన్ 7న లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది.
ఆన్-ఫీల్డ్ అంపైర్లతో సహా ఐదుగురు మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో వ్యవహరించనున్నాడు.
ఇక ఫోర్త్ అంపైర్‌గా శ్రీలంకకు చెందిన సీనియర్ అంపైర్ కుమార్ ధర్మసేన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదే విధంగా మ్యాచ్ రిఫరీగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం రిచీ రిచర్డ్‌సన్ వ్యవహరించునున్నాడు. కాగా క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఐపీఎల్-2023లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇప్పడు ఇదే అంపైర్‌లు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఫీల్డ్‌అంపైర్‌లగా ఎంపిక కావడం గమానార్హం. ఇక ఇప్పటికే లండన్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. ఈ జాబితాలో షమీ, జడేజా, గిల్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు.
చదవండి: IPL 2023: ధోని అంటే ఇంత అభిమానమా? రాత్రంతా రోడ్లపై పడుకుని! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment