నాల్గో టెస్టు: అంపైర్ 'రిటైర్డ్హర్ట్'! | umpire Reiffel retired hurt from the field | Sakshi
Sakshi News home page

నాల్గో టెస్టు: అంపైర్ 'రిటైర్డ్హర్ట్'!

Dec 8 2016 1:22 PM | Updated on Sep 4 2017 10:14 PM

నాల్గో టెస్టు: అంపైర్ 'రిటైర్డ్హర్ట్'!

నాల్గో టెస్టు: అంపైర్ 'రిటైర్డ్హర్ట్'!

భారత్-ఇంగ్లండ్ జట్లు మధ్య ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్హర్ట్ అయ్యాడు.

ముంబై:భారత్-ఇంగ్లండ్ జట్లు మధ్య ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్హర్ట్ అయ్యాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49.0 ఓవర్ను రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. ఈ క్రమంలోనే అతను విసిరిన రెండో బంతిని ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్  లెగ్ స్టంప్ మీదుగా తరలించి సింగిల్ తీశాడు. అయితే భారత ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ నేరుగా విసిరిన బంతి అంపైర్ తల వెనుక బాగాన తగిలింది. దాంతో అంపైర్ ఫీల్డ్లో పడిపోయాడు. అనంతరం ఫిజియోలో అతనికి ప్రాథమిక చికిత్స చేసిన తరువాత రైఫెల్ ఫీల్డ్ను వదిలి వెళ్లిపోయాడు. అతని స్థానంలో టీవీ అంపైర్ ఎరస్మస్ ఫీల్డ్ అంపైర్గా వచ్చాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. అలెస్టర్ కుక్(46), జో రూట్(21)లను వికెట్లను ఇంగ్లండ్ కోల్పోగా, ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన జెన్నింగ్స్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement