ప్రతీకాత్మక చిత్రం
కరాచీ : ఓ క్రికెట్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో జరుగుతున్న లోకల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 56 ఏళ్ల నసీమ్ షేక్ కరాచీలోని టీఎంసీ గ్రౌండ్‌లో జరుగుతున్న లాయర్స్ టోర్నమెంట్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో అతనికి గుండెపోటు రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారు నసీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, వృత్తి రీత్యా నసీమ్ మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ.. క్రికెట్‌పై ఉన్న అమితమైన ప్రేమ అతన్ని అర్హత కలిగిన అంపైర్‌గా మారేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment