దావూద్‌ ఇబ్రహీం మృతి? | Chhota Shakeel slams heart attack rumours about Dawood Ibrahim | Sakshi
Sakshi News home page

దావూద్‌ ఇబ్రహీం మృతి?

Published Sun, Apr 30 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

దావూద్‌ ఇబ్రహీం మృతి?

దావూద్‌ ఇబ్రహీం మృతి?

పాక్‌ మీడియాలో కథనం.. నిజం కాదన్న చోటా షకీల్‌
న్యూఢిల్లీ: మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం (61) తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కరాచీలో మృతిచెందినట్లు పాకిస్తాన్‌ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే అతడు గుండెపోటుతో కరాచీలోని ఆగాఖాన్‌ ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి విషమంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను దావూద్‌ చిరకాల సన్నిహితుడు చోటా షకీల్‌ తోసిపుచ్చారు.

దావూద్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ఓ టీవీ చానల్‌కు చెప్పాడు. 257 మందిని బలిగొన్న 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ను పట్టుకోవడానికి భారత్‌ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. దావూద్‌ తమ దేశంలో లేడని చెప్పేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అతని ఆరోగ్య వివరాలను బయటపెట్టడం లేదని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న కరాచీలోని తన అల్లుడి ఇంట్లో జరిగిన విందులో దావూద్‌ చివరిసారిగా బయటి ప్రపంచానికి కనిపించాడని నిఘా వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement