
దావూద్‌కు గుండెపోటు
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు శుక్రవారం గుండెపోటు వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్ దావూద్‌ను ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో ఉంచినట్లు తెలిసింది. ఈ మేరకు దావూద్ కుడిభుజం చోటా షకీల్ జాతీయ మీడియాకు సమాచారం ఇచ్చాడు. అయితే దావూద్‌కు ఏమీ కాలేదని, అతను సేఫ్‌గా ఉన్నట్లు మరో రిపోర్టు కూడా వచ్చింది. గతేడాది దావూద్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.