
దుబాయ్ : ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం జరిగింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు. రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో సీఎస్‌కే ఆటగాడు స్యామ్ కరన్ బౌలింగ్ వేశాడు. ఓవర్‌లోని నాలుగో బంతిని ఎదుర్కొన్న దినేష్ కార్తీక్‌కు బాల్ అందకుండా వికెట్లకు కాస్త దూరంగా వెళ్ళింది. దీంతో వైడ్ కాదా అంటూ అంపైర్‌ను తెలుగులో ప్రశ్నించాడు. దీనికి హైదరాబాద్‌కు చెందిన అంపైర్ షంషుద్దీన్ తెలుగులోనే సమాధానం ఇచ్చాడు. `లోపల..చాలా లోపల. కొంచెం గూడ కాదు.. అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కామెంట్స్ సైతం పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. (కేకేఆర్ బౌలర్‌కి ధోనీ సూచనలు)
Comments
Please login to add a commentAdd a comment