Shamsuddin
-
వైరల్ వీడియో: వైడ్ కాదా.. చాలా లోపల
దుబాయ్ : ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం జరిగింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు. రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సీఎస్కే ఆటగాడు స్యామ్ కరన్ బౌలింగ్ వేశాడు. ఓవర్లోని నాలుగో బంతిని ఎదుర్కొన్న దినేష్ కార్తీక్‌కు బాల్ అందకుండా వికెట్లకు కాస్త దూరంగా వెళ్ళింది. దీంతో వైడ్ కాదా అంటూ అంపైర్‌ను తెలుగులో ప్రశ్నించాడు. దీనికి హైదరాబాద్‌కు చెందిన అంపైర్ షంషుద్దీన్ తెలుగులోనే సమాధానం ఇచ్చాడు. `లోపల..చాలా లోపల. కొంచెం గూడ కాదు.. అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కామెంట్స్ సైతం పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. (కేకేఆర్ బౌలర్‌కి ధోనీ సూచనలు) -
వైరల్ వీడియో: వైడ్ కాదా.. చాలా లోపల
-
రెండు వైపుల నుంచి ఒకరే అంపైరింగ్!
రంజీ ఫైనల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సి.షంషుద్దీన్‌కు దెబ్బ తగిలింది. వికెట్ తీసిన ఆనందంలో బెంగాల్ ఫీల్డర్ ఒకరు బంతిని విసరగా దీనిని గమనించని షంషుద్దీన్ పొత్తి కడుపునకు బలంగా తగిలింది. దాంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అంపైర్‌ను సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఒక సెషన్ పాటు మరో ఆన్‌ఫీల్డ్ అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్ ప్రతీ ఓవర్‌కు మారుతూ రెండు ఎండ్ల నుంచి అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక అంపైర్ పీయూష్ కక్కడ్ స్క్వేర్ లెగ్ అంపైర్‌గా నిలబడిపోయారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్‌కు తటస్థ అంపైర్లు ఉండాలి. పీయూష్ సౌరాష్ట్రకు చెందినవాడు కావడంతో మెయిన్ ఎండ్ నుంచి అంపైరింగ్ చేయనివ్వలేదు. థర్డ్ అంపైర్ రవికి మాత్రమే డీఆర్ఎస్ విధానంపై అవగాహన ఉండటంతో ఆయనా మైదానంలోకి రాలేదు. చివరకు షంషుద్దీన్‌ను టీవీ అంపైర్ స్థానంలో కూర్చోబెట్టి రవి ఆ తర్వాత అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. రంజీ ఫైనల్ నిర్వహణలో ఈ తరహా బీసీసీఐ వైఫల్యంపై విమర్శలు వచ్చాయి. ముంబై నుంచి రానున్న యశ్వంత్ బర్డే నేటినుంచి ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. -
డబుల్స్ ఫైనల్లో పేస్ జంట
ఎగాన్ ఇల్‌క్లే ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 6–4, 7–6 (7/2)తో జాన్ మిల్మన్–లూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు బర్మింగ్‌హామ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండెవాగె (అమెరికా) జంటకు క్వార్టర్ ఫైనల్లో వాకోవర్ లభించడంతో సెమీఫైనల్‌కు చేరింది.