PC: X.com
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో ఓటమి చవిచూసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించనప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎస్‌కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే జేబులను ఆన్ ఫీల్డ్ అంపైర్ చెక్ చేశాడు. దూబే క్రీజులోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనిల్ చౌదరీ.. అతడి దగ్గరకు వెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు.
ఇందుకు సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియా కాగా అంపైర్‌లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్ దూబే పాకెట్స్‌ను చెక్ చేయడానికి గల కారణమైతే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్‌లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్ధితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకు వచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు.
అదే విధంగా ఆటగాళ్లు అంపైర్‌లు అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ గానీ అయింట్‌మెంట్‌లు గాని వాడకూడదు. కాగా ఈ మ్యాచ్‌లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.
What Umpire is checking on the Shivam Dube's Pocket? pic.twitter.com/xi4ipbWyNR
— Jay Cricket. (@Jay_Cricket18) April 19, 2024
What’s happening here between the umpire and #ShivamDube?#IPL2024 #CSKvsLSG #MSDhoni #Thala #Mahi #Yellove #WhistlePodu pic.twitter.com/Q5AZ5z1Rn1
— Run Chase HQ (@runchaseHQ) April 19, 2024
Comments
Please login to add a commentAdd a comment