anil chowdhary
-
'రోహిత్ శర్మ చాలా స్మార్ట్.. తక్కువగా అంచనా వేస్తే అంతే సంగతి'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఐసీసీ ప్యానల్ అంపైర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడని, అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనిల్ చౌదరి కొనియాడాడు.కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. అయితే తాజాగా యూట్యూబ్ పాడ్‌కాస్ట్ షో 'అన్ప్లగ్డ్సలో అనిల్ చౌదరి మాట్లాడుతూ.. "రోహిత్ శర్మ బయటకు చాలా సాధారణంగా కన్పిస్తాడు.కానీ అతడు చాలా తెలివైన ఆటగాడు. అతడిని తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. రోహిత్ గేమ్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను ఎవరూ అంచనా వేయలేరు. అతడు ఆడుతున్నప్పుడు 160 కి.మీ వేగంతో బంతి వచ్చినా అంది 120 కి.మీ వేగం లానే అన్పిస్తుంది. అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ల నుంచి చాలా అప్పీల్స్ వస్తాయి. కానీ అతడి బ్యాటింగ్ స్టైల్లో ఎటువంటి మార్పు ఉండదు. రోహిత్ లాంటి ఆటగాడికి అంపైరింగ్ చేయడం చాలా సులభం.మన నిర్ణయాన్ని ఈజీగా ప్రకటించవచ్చు. ఎందుకంటే అతడు ఎప్పుడు కన్ఫ్యూజిన్తో ఆడడు. హిట్‌మ్యాన్ తెలిసిందే అంతా ఒక్కటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు సాధించడమే అతడి లక్ష్యమని" పేర్కొన్నాడు.చదవండి: #Babar Azam: బాబర్ ఆజం కథ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ? -
'బంతి బంతికి అరుస్తునే ఉంటాడు'.. రిజ్వాన్‌పై భారత అంపైర్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ వరల్డ్ క్రికెట్ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌లతో పాకిస్తాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఘనత రిజ్వాన్‌ది. అయితే రిజ్వాన్ తన ఆటతీరుతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. మైదానంలో తన చేష్టలతో అంతే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. వికెట్ల వెనక ఉండి పదే పదే అప్పీల్ చేయడం, క్రాంప్స్(తిమ్మరి) వచ్చినట్లు మైదానంలో పడిపోవడం వంటివి చేస్తూ అంపైర్లను ఎక్కవగా అతడు విసుగిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రిజ్వాన్‌పై భారత్‌కు చెందిన ఐసీసీ ఎలైట్ ప్యానిల్ అంపైర్ అనిల్ చౌదరి విమర్శల వర్షం కురిపించాడు. రిజ్వాన్ ప్రతీ బంతికి అప్పీల్ చేస్తాడని, అది సరైన పద్దతి కాదని చౌదరి మండిపడ్డాడు."ఆసియాకప్‌లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు నేను ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాను. మహ్మద్ రిజ్వాన్ వికెట్లు వెనక ఉండి కంటిన్యూగా అప్పీల్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే చాలా మ్యాచ్‌ల్లో అతడి తీరును నేను గమనించాను. అయితే నాతో పాటు ఉన్న మరో అంపైర్‌కు రిజ్వాన్ కోసం పెద్దగా తెలియదు.కాబట్టి అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలని నా తోటి అంపైర్‌కు చెప్పాను. ఓ సందర్భంలో రిజ్వాన్ గట్టిగా అప్పీల్ చేయడంతో నాతోటి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తడానికి సిద్దమయ్యాడు. కానీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని నాటౌట్ అంటూ తలఊపాడు. పాక్ రివ్యూకు వెళ్లినప్పటకి నాటౌట్ తేలింది.రిజ్వాన్ అంతే బంతి బంతికి అరుస్తూనే ఉంటాడు. తెల్లటి లిప్ బామ్ పూసుకుని పావురంలా జంప్ చేస్తూ ఉంటాడు. మంచి కీపర్ ఎవరనేది మంచి అంపైర్‌కు తెలుస్తుంది. అంతేతప్ప పదేపదే అప్పీల్ చేస్తే ఔట్‌గా ప్రకటించడు. అంతేకాకుండా టెక్నాలజీ కూడా బాగా అభివృద్ది చెంది. అటువంటి అప్పుడు మీరు ఎందుకు హైలెట్ కావాలి. ప్రజలు అంతా గమనిస్తారు. ఆఖరి ట్రోల్స్‌కు గురవ్వడం తప్ప ఇంకొకటి ఉండదు"అని చౌదరి ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా రిజ్వాన్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 249 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 171 పరుగులు చేశాడు. -
దూబే చీటింగ్ చేశాడా..? జేబులు చెక్ చేసిన అంపైర్! ఫోటోలు వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో ఓటమి చవిచూసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించనప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే జేబులను ఆన్ ఫీల్డ్ అంపైర్ చెక్ చేశాడు. దూబే క్రీజులోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనిల్ చౌదరీ.. అతడి దగ్గరకు వెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు. ఇందుకు సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియా కాగా అంపైర్లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్ దూబే పాకెట్స్‌ను చెక్ చేయడానికి గల కారణమైతే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్ధితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకు వచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆటగాళ్లు అంపైర్లు అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ గానీ అయింట్మెంట్లు గాని వాడకూడదు. కాగా ఈ మ్యాచ్‌లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. What Umpire is checking on the Shivam Dube's Pocket? pic.twitter.com/xi4ipbWyNR — Jay Cricket. (@Jay_Cricket18) April 19, 2024 What’s happening here between the umpire and #ShivamDube?#IPL2024 #CSKvsLSG #MSDhoni #Thala #Mahi #Yellove #WhistlePodu pic.twitter.com/Q5AZ5z1Rn1 — Run Chase HQ (@runchaseHQ) April 19, 2024 -
'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం
ఆసియాకప్-2022లో భాగంగా అఖరి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు శ్రీలంక షాకిచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన హాసన్ అలీ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బంతిని షనక కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి మిస్స్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. అయితే బంతి బ్యాట్‌కు తగిలిందిని భావించిన రిజ్వాన్ కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. దాన్ని ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి మాత్రం తిరస్కరించాడు. ఈ క్రమంలో రిజ్వాన్ రివ్యూ కోసం అంపైర్‌కు సిగ్నల్ చేశాడు. అంపైర్ వెంటనే రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకలేదని రిప్లేలో తెలింది. దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. సాధారణంగా ఏ ఫార్మాట్లోనైనా కెప్టెన్ రివ్యూకి సిగ్నల్ చేస్తేనే.. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం కెప్టెన్‌తో సంబంధం లేకుండా వికెట్ కీపర్ కీపర్ సూచనల మేరకు అంపైర్ రివ్యూకు రిఫర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్ రిజ్వాన్ కాదు నేను' అంటూ బాబర్ అంపైర్‌కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో టైటిల్ కోసం పాక్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. #WTH #BabarAzam #DRS #SLvPAK pic.twitter.com/2t33bls4nN — Cricket fan (@Cricket58214082) September 9, 2022 చదవండి: Ravindra Jadejas Knee Injury : రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం..! -
27 ఏళ్ల తర్వాత తొలి సారిగా..
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి సారిగా ఇద్దరు స్వదేశీ అంపైర్లు ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చివరి సారిగా ఇద్దరు భారత అంపైర్లు బరిలో నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఎల్.నరసింహన్, వీకే రామస్వామిలు ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు భారత అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరీలు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కొద్ది రోజుల ముందే నితిన్ మీనన్, అనిల్ చౌదరీతో పాటు వీరేందర్ శర్మ అనే అంపైర్‌ను ఐసీసీ నియమించింది. తొలి టెస్టులో అనిల్, నితిన్ బరిలో నిలువగా రెండో టెస్టులో నితిన్‌కు తోడుగా వీరేందర్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. కరోనా ప్రయాణ అంక్షల కారణంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్సిప్కు స్థానిక అంపైర్లనే నియమించుకోవాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ అంపైర్ల ప్యానల్లో సభ్యులైన ఈ ముగ్గురు భారత అంపైర్లకు ఈ అరుదైన అవకాశం దక్కింది. మరోవైపు సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు భారతకు చెందిన వ్యక్తే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌లకు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వహించనున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్ నేతలు
-
వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్ నేతలు
పులివెందుల: ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నేతలు, సామాన్యులు అమితాసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన అనిల్ చౌదరి, మంజునాథ చౌదరి సహా 500 కుటుంబాలకు చెందినవారు వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి వీరికి సాదరస్వాగతం పలికారు. జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేస్తామని వీరు తెలిపారు.