పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ వరల్డ్ క్రికెట్ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌లతో పాకిస్తాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఘనత రిజ్వాన్‌ది. అయితే రిజ్వాన్ తన ఆటతీరుతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. మైదానంలో తన చేష్టలతో అంతే చెడ్డపేరు తెచ్చుకున్నాడు.
వికెట్ల వెనక ఉండి పదే పదే అప్పీల్ చేయడం, క్రాంప్స్(తిమ్మరి) వచ్చినట్లు మైదానంలో పడిపోవడం వంటివి చేస్తూ అంపైర్‌లను ఎక్కవగా అతడు విసుగిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రిజ్వాన్‌పై భారత్‌కు చెందిన ఐసీసీ ఎలైట్ ప్యానిల్ అంపైర్ అనిల్ చౌదరి విమర్శల వర్షం కురిపించాడు. రిజ్వాన్ ప్రతీ బంతికి అప్పీల్ చేస్తాడని, అది సరైన పద్దతి కాదని చౌదరి మండిపడ్డాడు.
"ఆసియాకప్‌లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు నేను ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాను. మహ్మద్ రిజ్వాన్ వికెట్లు వెనక ఉండి కంటిన్యూగా అప్పీల్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే చాలా మ్యాచ్‌ల్లో అతడి తీరును నేను గమనించాను. అయితే నాతో పాటు ఉన్న మరో అంపైర్‌కు రిజ్వాన్ కోసం పెద్దగా తెలియదు.
కాబట్టి అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలని నా తోటి అంపైర్‌కు చెప్పాను. ఓ సందర్భంలో రిజ్వాన్ గట్టిగా అప్పీల్ చేయడంతో నాతోటి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తడానికి సిద్దమయ్యాడు. కానీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని నాటౌట్ అంటూ తలఊపాడు. పాక్ రివ్యూకు వెళ్లినప్పటకి నాటౌట్ తేలింది.
రిజ్వాన్ అంతే బంతి బంతికి అరుస్తూనే ఉంటాడు. తెల్లటి లిప్ బామ్ పూసుకుని పావురంలా జంప్ చేస్తూ ఉంటాడు. మంచి కీపర్ ఎవరనేది మంచి అంపైర్‌కు తెలుస్తుంది. అంతేతప్ప పదేపదే అప్పీల్ చేస్తే ఔట్‌గా ప్రకటించడు. అంతేకాకుండా టెక్నాలజీ కూడా బాగా అభివృద్ది చెంది.
అటువంటి అప్పుడు మీరు ఎందుకు హైలెట్ కావాలి. ప్రజలు అంతా గమనిస్తారు. ఆఖరి ట్రోల్స్‌కు గురవ్వడం తప్ప ఇంకొకటి ఉండదు"అని చౌదరి ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా రిజ్వాన్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 249 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 171 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment