PC: Twitter
ఆసియాకప్-2022లో భాగంగా అఖరి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు శ్రీలంక షాకిచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన హాసన్ అలీ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బంతిని షనక కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
బంతి మిస్స్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. అయితే బంతి బ్యాట్‌కు తగిలిందిని భావించిన రిజ్వాన్ కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. దాన్ని ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి మాత్రం తిరస్కరించాడు. ఈ క్రమంలో రిజ్వాన్ రివ్యూ కోసం అంపైర్‌కు సిగ్నల్ చేశాడు. అంపైర్ వెంటనే రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకలేదని రిప్లేలో తెలింది.
దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. సాధారణంగా ఏ ఫార్మాట్‌లోనైనా కెప్టెన్ రివ్యూకి సిగ్నల్ చేస్తేనే.. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం కెప్టెన్‌తో సంబంధం లేకుండా వికెట్ కీపర్ కీపర్ సూచనల మేరకు అంపైర్ రివ్యూకు రిఫర్ చేయడం గమనార్హం.
ఈ క్రమంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్ రిజ్వాన్ కాదు నేను' అంటూ బాబర్ అంపైర్‌కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో టైటిల్ కోసం పాక్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
#WTH #BabarAzam #DRS #SLvPAK pic.twitter.com/2t33bls4nN
— Cricket fan (@Cricket58214082) September 9, 2022
చదవండి: Ravindra Jadejas Knee Injury : రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం..!
Comments
Please login to add a commentAdd a comment