భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. మంగళవారం(డిసెంబర్ 26)న జరగనున్న ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిచర్డ్ కెటిల్‌బరో వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని లాంగ్టన్ రుసెరేను ఐసీసీ భర్తీ చేసింది.
కాగా సౌతాఫ్రికా- భారత్ మధ్య టెస్టు సిరీస్‌కు ఐసీసీ తొలుత ప్రకటించిన జాబితాలో అంపైర్‌లుగా కెటిల్‌బరో, పాల్ రీఫిల్ అహ్సన్ రజాకు చోటు దక్కింది. ఇప్పుడు కెటిల్‌బరో తప్పుకోవడంతో రుసెరేను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సిరీస్ నుంచి కెటిల్‌బరో తప్పకోవడం పట్ల భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే అతడు అంపైర్‌గా వ్యవహరించిన చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలైంది. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్స్‌లో భారత జట్టు గెలిచిన సందర్భాలు లేవు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్స్‌లో కూడా కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. అంతకుముందు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్, ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్, 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ ఓటమి పాలైంది.
చదవండి: IND vs SA 1st Test: ధోనీ అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment