ఆక్లాండ్: పేసర్ జేకబ్ డఫీ (4/33) అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టడంతో శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్లతో నెగ్గి శుభారంభం చేసింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. కెపె్టన్ షాదాబ్ ఖాన్ (32 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. డఫీ ధాటికి 79/6తో కష్టాల్లో పడిన పాక్ జట్టు... చివర్లో ఫహీమ్ అష్రఫ్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 150 పరుగులు దాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేకబ్ డఫీ 4, స్కాట్ కుగ్లీన్ 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం న్యూజిలాండ్ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. టిమ్ సీఫెర్ట్ (43 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో అలరించాడు. మార్క్ చాప్‌మన్ (20 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగుల్ని జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.
కివీస్ శుభారంభం
Published Sat, Dec 19 2020 5:16 AM | Last Updated on Sat, Dec 19 2020 5:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment