Mohammad Rizwan Named T20 Cricketer Of The Year: 2021వ సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డుకు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిజ్వాన్.. 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటున 1326 పరుగులు బాదాడు. అతని స్ట్రయిక్ రేట్ 134.89గా ఉంది. బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటిన రిజ్వాన్.. గతేడాది పాక్ సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥
— ICC (@ICC) January 23, 2022
2021 was memorable for Mohammad Rizwan 👊
More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA
టీ20 ప్రపంచకప్ 2021లో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచిన అతను.. తన జట్టు సెమీస్ చేరేందుకు తోడ్పడ్డాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 19 టెస్ట్‌లు, 41 వన్డేలు, 55 టీ20లు ఆడిన రిజ్వాన్.. 3500కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, గతేడాది అసోసియేట్ దేశాల అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డును ఒమన్‌కు చెందిన జీషన్ మక్సూద్ గెలుచుకున్నాడు. ఒమన్ జట్టును సమర్ధవంతంగా నడిపించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను మక్సూద్‌ను ఈ అవార్డు వరించింది.
చదవండి: ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment