సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్-2024ను న్యూజిలాండ్ ఆటగాడు స్నేహిత్ రెడ్డి ఘనంగా ఆరంభించాడు. ఈస్ట్ లండన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. స్నేహిత్ తెలుగు సంతతికి చెందిన క్రికెటరే కావడం విశేషం.
17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. ఇక సెంచరీతో చెలరేగిన స్నేహిత్ రెడ్డి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్నేహిత్ మాట్లాడుతూ.. టీమిండియా ప్రిన్స్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. శుబ్‌మన్ గిల్ తనను ఎంతగానే ప్రభావితం చేశాడని స్నేహిత్ తెలిపాడు. అంతేకాకుండా గిల్ బోడౌన్ సెంచరీ సెలబ్రేషన్స్ స్టైల్‌ను స్నేహిత్ రెడ్డి అనుకరించాడు.
"తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్. ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేశాను. కాగా ఈ మ్యాచ్‌కు ముందే మా సెంచరీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. నేను అయితే శుబ్‌మన్ గిల్ 'బౌడౌన్' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని చెప్పాను.
ఎందుకంటే నా అభిమాన క్రికెటర్లలో శుబ్‌మన్ ఒకడు. అతడు బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టం. అతడి షాట్ సెలక్షన్ కూడా అద్బుతం. గిల్ బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో స్నేహిత్ రెడ్డి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 64 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది.
చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు!
❤️ A moment shared with family
— ICC (@ICC) January 22, 2024
🫶 Enjoying the occasion
✨ Shubman Gill's influence
New Zealand's Snehith Reddy reflects on his #U19WorldCup century 💯 pic.twitter.com/szYB81B0yi
Comments
Please login to add a commentAdd a comment