క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానున్నారు. కాగా ఇప్పటికే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జర్నలిస్ట్‌లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 60 మంది జర్నలిస్టులతో పాటు జకా అష్రఫ్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. "నేను గురువారం భారత్‌కు పయనం కానున్నాను. నా ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్ చేయడానికి పాకిస్తాన్ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది.
వీసాల జారీపై భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా జర్నలిస్టులతో కలిసి భారత్‌కు రానున్నాను. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.
జట్టును ప్రోత్సహించేందుకు నేను భారత్‌కు వెళుతున్నాను. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మా జట్టుకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడాలని పీసీబీ విడుదల చేసిన వీడియోలో అష్రఫ్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన కోహ్లి.. రాహుల్ ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment