Baluchistan
-
పాక్‌లో పేలుళ్లు.. 30 మంది బలి
కరాచీ: సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమవుతున్న వేళ బుధవారం జంట పేలుళ్లతో పాకిస్తాన్ దద్దరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనల్లో మొత్తంగా 25 మంది మరణించారు. 42 మంది గాయపడ్డారు. పర్వతమయమైన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్వేరు పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు జరిపారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ పేలుళ్లు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. తొలి పేలుడు పిషిన్ జిల్లాలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫాందర్ ఖాన్ కకర్ ఆఫీస్ బయట జరిగింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఒక గంట తర్వాత కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్ ఉలేమా ఇస్లామ్–పాకిస్తాన్ పార్టీ కార్యాలయం బయట జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకే ఇలా ఉగ్రవాదులు బాంబు దాడులతో భయపెడుతున్నారని బలూచిస్తాన్ పంజ్‌ఘర్ సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాంబుపేలుళ్ల జరగడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. బలూచిస్తాన్‌లో పెరిగిన దాడులు అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న పర్వతమయ బలూచిస్తాన్‌లో ఇటీవల బాంబు దాడులు ఎక్కువయ్యాయి. మంగళవారం సైతం 10 గ్రనేడ్ దాడులు జరిగాయి. వేర్వేరు ప్రావిన్స్‌లలోని భద్రతా పోస్ట్‌లు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై ఈ దాడులు జరిగాయి. ఆదివారం నుంచి లెక్కిస్తే ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది. చాన్నాళ్ల నుంచి బలూచిస్తాన్‌లో వేర్వేరువాద శక్తుల క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సైన్యం ఏరివేత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జనవరిలో 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే -
పాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా..
ఇస్లామాబాద్: సోమవారం అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ల్యాండ్‌మైన్ పేల్చారు దుండగులు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ (యుసి) ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసి ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని దుండగులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో తెలిపారు. వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ ఉన్నట్లు వీరంతా బల్గతార్, పంజ్గూర్ ప్రాంతానికి చెందినవారని అన్నారు. ఈ ప్రమాదం జరిగిన చోటే 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రి తోపాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబుదాడిలో హత్య చేయబడ్డారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(BLF) అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి -
పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. త్వరలో పీసీబీకి చైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది.జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. 2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్‌కు హాజరవ్వాలని కోరింది. అయితే పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తేనే పీసీబీ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్ బాడీ ప్రాసెస్‌ను మొత్తం రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి పీసీబీ గవర్నింగ్ బాడీ పది మంది పాలకవర్గంతో ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరందరు కలిసి నూతన చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఇవాళ విడుదలైన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌కు సంబంధించి పాకిస్తాన్ తన మ్యాచ్‌లన్నీ దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. భారత్‌తో మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడనుంది. అక్టోబర్ 15న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్‌కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్‌లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఓటు వేసిన ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. అంతేగాక దక్షిణాదిన పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు -
పాకిస్తాన్ రక్తసిక్తం.. వందకుపైగా సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తమైంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. గమనించి వెంటనే కారు ఆపి..) -
పాక్ పైత్యం: వాళ్ల ఫోన్లలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని మోగాల్సిందే..
ఇస్లామాబాద్: అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, సీనియర్ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ రింగ్టోన్లను 'పాకిస్తాన్ జిందాబాద్' ట్రాక్‌కి సెట్ చేయాలని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ నిబంధనను అందరూ తప్పక పాటించాలని హుకుం కూడా జారీ చేసింది. సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అధికారులు వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీని ప్రకారం ప్రభుత్వ విభాగంలో పని చేసే చీఫ్ స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల వరకు వారి మొబైల్ ఫోన్ రింగ్టోన్లుగా పాకిస్తాన్ జిందాబాద్ అనే పెట్టుకోవాల్సిందే. ప్రాంతీయ ప్రభుత్వ సేవలు, సాధారణ పరిపాలన విభాగం చీఫ్ సెక్రటరీ సెప్టెంబర్ 29న ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏ కారణాలను వెల్లడించకుండా ఈ నిర్ణయం ఏంటని విమర్శలు వెల్లువెత్తగా, మరో వైపు సోషల్‌మీడియాలో నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్ -
పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్
లండన్: మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్ హుసేన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తువా, గిల్గిట్ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్- ఖైదా, తాలిబన్, లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలను పాక్ ఐఎస్ఐ సృష్టించిందని.. వందలాది మంది ఉగ్రవాదులను తయారు చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య ముసుగులో ఐఎస్ఐ చేస్తున్న అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలను అత్యంత అణచివేతకు గురిచేసే ప్రపంచంలో ఏకైక ప్రభుత్వాన్ని నడిపిస్తోంది సైన్యమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.(పాక్‌లో హిందువులపై పెచ్చుమీరుతున్న అకృత్యాలు) ఈ మేరకు అల్తాఫ్ పెంటగాన్‌కు లేఖ రాశారు. ‘‘పాకిస్తాన్ సైన్యం సింధు, బలూచిస్తాన్, కేపీకే, గిల్టిట్ బల్టిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించింది. మైనార్టీలపై పాశవిక, క్రూర చర్యలకు పాల్పడుతోంది. నేటికీ అక్కడ అణచివేత కొనసాగుతోంది. శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకునే మీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌కు అందిస్తున్న పౌర, సైన్య సహకారాన్ని నిలిపివేయండి’’అని లేఖలో కోరారు. ఇక అమెరికాలో ఆగ్రహజ్వాలలకు కారణమైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై కూడా అల్తాఫ్ స్పందించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు అధికారులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని.. అదే విధంగా జాతి వివక్షను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (లాక్డౌన్ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్ ఖాన్) కాగా పాకిస్తాన్లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించేందుకు ముత్తాహిద కౌమీ ఉద్యమం పేరిట అల్తాఫ్ హుసేన్ 1984, మార్చి 18న పార్టీని స్థాపించారు. సెక్యూలర్ పార్టీగా పేరొందిన ఎంక్యూఎమ్ ప్రస్తుతం రెండు వర్గాలు చీలిపోయింది. ఎమ్‌క్యూఎమ్- లండన్ బాధ్యతలను అల్తాఫ్ పర్యవేక్షిస్తుండగా.. పాకిస్తాన్‌లోని పార్టీ విభాగాన్ని ఖాలిద్ మక్బూల్ సిద్ధిఖీ నడిపిస్తున్నారు. ముజాహిర్ల(పాకిస్తాన్‌కు వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు) హక్కులకై పోరాడే ఎంక్యూఎమ్ 1990-1999 మధ్య కాలంలో పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. చదవండి: హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. నేపాల్, పాకిస్తాన్ మద్దతు -
కరోనా: డాక్టర్లపై లాఠీఛార్జ్.. అరెస్ట్
ఇస్లామాబాద్ : చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లు, సైంటిస్టులనే దేవుళ్లుగా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వైద్యసిబ్బందికి అవసరమైన పరికరాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల కనీస ధర్మం. అయితే వారికి అవసరమైన సామాగ్రిని అందించకపోగా, నిరసన తెలిపిన డాక్టర్లు, వైద్యసిబ్బందిపై లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేసింది పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న 53 మంది డాక్టర్లు, వైద్యసిబ్బందిని అరెస్ట్ చేసినట్లు క్వెట్టా పట్టణ పోలీస్ సీనియర్ అధికారి అబ్దుల్ రజాక్ మీడియాకు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే?? ‘కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల కొరత ఉంది. మాస్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్థిస్థాయి గౌనులు అందుబాటులో లేవు. పీపీఈ కిట్లను అందించాలని గత కొన్ని వారాలుగా ప్రభుత్నాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రి ముందు నిరసన తెలిపాం. అంతేకాకుండా మేమేందరం(డాక్టర్లు, వైద్య సిబ్బంది) సీఎం ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకున్నాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొని లాఠీఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు’అని క్వెట్టా పట్టణ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు యాసీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే? అయితే డాక్టర్లు, వైద్యసిబ్బంది అరెస్ట్‌పై బలుచిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. ‘పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమేనని అంగీకరిస్తున్నాం. అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. అందుకే ఆరెస్ట్ చేశాం’అని బులచిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక డాక్టర్లపై లాఠీచార్జ్, అరెస్ట్ చేయడంపై అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో డాక్టర్లను కాపాడుకోవాల్సింది పోయి ఆరెస్ట్ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,469కి చేరింది. బలుచిస్తాన్‌లో 192 కేసులు నమోదు అయ్యాయి. పాక్‌లో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు వెల్లడించాయి. చదవండి: పాత మందుతో 48 గంటల్లో వైరస్‌కు చెక్? అమెరికాలో మరింత తీవ్రం! -
పాక్‌లో ఉగ్రవాద శిక్షణకు సకల సౌకర్యాలు
పాకిస్తాన్లో వేలాది మంది యువకులను బలవంతంగా ఉగ్రవాదులు 'డీరాడికలైజేషన్ క్యాంప్స్' కేంద్రాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పాకిస్తాన్‌లోని పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలలో డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మందికి శిక్షణ అందించే విధంగా రూపొందించినట్లు ఉపగ్రహ చాయా చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తూనే వారి అవసరాల మేరకు అత్యున్నత మౌళిక సదుపాయాలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ప్రార్థనలు చేసేందుకు మసీదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశారు. (కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు) ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శిక్షణ పొందుతున్న వారిలో 92శాతం 35 కన్నా తక్కువ వయసువారే కావడం, మరో 12 శాతం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తెలిసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి వారు శిక్షణ అందిస్తున్న హైటెక్ శిబిరాలే చెబుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆపేందుకు ఉక్కు కంచె నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాక్ డీరాడికలైజేషన్ శిబిరాలు చర్చనీయాంశంగా మారాయి. -
పాక్ విషయాల్లో మన జోక్యం ఎందుకు?
హైదరాబాద్: బలూచిస్తాన్ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా బలూచిస్తాన్, జిల్జిత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వల్ల అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారని, వారికి మద్దతుగా మాట్లాడినందుకు తనకు వారు కృతజ్ఞతలు తెలిపారని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో మోదీ వ్యాఖ్యలు సరికాదని ఏచూరి అన్నారు. బలూచిస్తాన్ లో భారత్ జోక్యం చేసుకుంటే అది మతపరమైన వివాదాలకు తావిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పోలీసుల కాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం
పోలీసు సిబ్బంది జరిపిన కాల్పుల్లో నిషేధిత తీవ్రవాద సంస్థ తెహ్రిక్-ఈ-తాలిబాన్‌కు చెందిన నలుగురు తీవ్రవాదులు మృతి చెందారని సీఐడీ ఎస్పీ చౌదరి అస్లామ్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. మృతుల వద్ద నుంచి దాదాపు 200 కేజీల పేలుడు పదార్థంతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించినట్లు తెలిపారు. బాంబుల తయారీలో వారిద్దరు నిపుణులని పేర్కొన్నారు. గత అర్థరాత్రి బలూచిస్థాన్ నుంచి కరాచీ వైపు వస్తున్న ఓ ట్రక్‌ను పోలీసులు తనిఖీలలో భాగంగా అపారు. అయితే ఆ ట్రక్‌లో ఉన్న తీవ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఆ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలపాయ్యారు. అయితే వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చౌదరి అస్లామ్ వివరించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల అనంతరం పాకిస్థాన్‌లో కరాచీలో జరిగిన పలు బాంబు దాడులతో ఈ తీవ్రవాదుల ప్రమేయం ఉందని చౌదరి అస్లామ్ చెప్పారు.