హైదరాబాద్: బలూచిస్తాన్ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా బలూచిస్తాన్, జిల్‌జిత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వల్ల అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారని, వారికి మద్దతుగా మాట్లాడినందుకు తనకు వారు కృతజ్ఞతలు తెలిపారని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో మోదీ వ్యాఖ్యలు సరికాదని ఏచూరి అన్నారు. బలూచిస్తాన్ లో భారత్ జోక్యం చేసుకుంటే అది మతపరమైన వివాదాలకు తావిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పాక్ విషయాల్లో మన జోక్యం ఎందుకు?
Published Tue, Aug 16 2016 2:02 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement