కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ రద్దయింది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించే స్థితిలో తాము లేమని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డి సిల్వా ప్రకటించారు. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది పాకిస్తాన్‌లో జరగాల్సింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌లో భారత్ పర్యటించే అవకాశం లేకపోవడంతో టోర్నీ వేదికను పాక్ నుంచి శ్రీలంకకు మార్చారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్‌లో రెండేళ్లపాటు బిజీగా ఉండటంతో ఆసియా కప్ 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత జరిగే అవకాశముంది. ఆసియా కప్‌ను 2016 నుంచి రొటేషన్ పద్ధతిలో వన్డే, టి20 ఫార్మాట్‌లలో నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment