న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర మద్యపాన నిషేధ చట్టాన్ని కొట్టేస్తూ పట్నా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. మద్యం, ప్రాథమిక హక్కులు కలిసి సాగలేవని పేర్కొంది. ఈ చట్టాన్ని పట్నా హైకోర్టులో సవాలు చేసిన కక్షిదారులైన మద్యం తయారీ సంస్థలకు నోటీసులు జారీచేసింది. జన్యు ఆవాలపై స్టే.. జన్యుమార్పిడి ద్వారా అభివృద్ధి చేసిన ఆవాల(జీఎం మస్టర్డ్) విత్తనాల సరఫరాపై సుప్రీంకోర్టు పది రోజులపాటు స్టే విధించింది. విత్తనాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది.