న్యూఢిల్లీ: జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ సభాధ్యక్షుడు ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన జీతభత్యాలు, బంగళా సహా ఇతర సదుపాయాలన్నీ ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు కొనసాగుతాయని జడ్జి జస్టిస్ విభు బఖ్రు స్పష్టం చేశారు. కేసు తుది విచారణ మార్చి 1న మొదలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment