sharadh yadav
-
శరద్ యాదవ్ మాటలు సిగ్గుచేటు
జైపూర్: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్‌యాదవ్ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఒక అనుభవమున్న సీనియర్ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్ యాదవ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది. -
బీజేపీకి దేశం బంగారు బాతు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గంగానది అంత పవిత్రంగా చూస్తుంటే బీజేపీ మాత్రం దేశాన్ని బంగారు బాతులా చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. దేశంలోని సంపదను తన స్నేహితులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన సంజీ విరాసత్ బచావో సమ్మేళన్ కార్యక్రమానికి రాహుల్ హాజరై మాట్లాడారు. జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీఎస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్ఎల్డీ, ఎన్సీపీ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. ఈ బంగారు బాతును బంధించేందుకు బీజేపీ పంజరాన్ని తయారుచేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు తాము సర్వశక్తులా పోరాడతామని స్పష్టం చేశారు. తాము బీజేపీ ముక్త్ భారత్‌ను కోరుకోవడం లేదని, బీజేపీని నాశనం చేయాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు. తమ సిద్ధాంతాలు, భావజాలం బీజేపీ కంటే బలమైనవని మాత్రమే నిరూపించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిపక్షాలన్నీ కలసి రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశమంతా బీజేపీని ఓడిస్తాయని రాహుల్ జోస్యం చెప్పారు. అలాగే రూ.524 కోట్ల విలువైన ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్రం రూ.1,600 కోట్లు చెల్లిస్తోందని దుయ్యబట్టారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఒక్కో వాక్యం పూర్తిచేశాక మోదీ అక్కడ ఉన్న టీచర్లవైపు చూస్తారనీ, దీంతో వాళ్లు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తున్నారని రాహుల్ అన్నారు. ఇదంతా పక్కా డ్రామాలా సాగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ నాయకుడు చన్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. -
‘నితీష్ ఢిల్లీకి మకాం మారుస్తారు’
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీకి మకాం మారుస్తారని ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. కేంద్ర గృహ పట్టణాభివృధ్దిశాఖ నితీష్‌కు ఢిల్లీలో సుందరమైన బంగ్లా కేటాయిండంతో ఇక నితీష్ బిహార్ వదిలి ఢిల్లీకి మకాం మారుస్తారని ఆర్జేడీ పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఆర్జేడీ వ్యాఖ్యలను ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ఖండించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ముఖ్యమంత్రికి అధికార నివాసాన్ని కల్పించడం కేంద్ర ప్రభుత్వ భాధ్యత అని దానిలో భాగంగానే నితీష్‌కు బంగ్లా కేటాయించినట్టు అధికారులు తెలిపారు. 2001-04 మధ్యకాలంలో నితీష్ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో అక్బర్ రోడ్లో అత్యాధునిక భవనంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది నితీష్... కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయుతో కూడిన మహాబంధన్ కూటమిని వదిలి ఎన్డీఏ కూటమిలో చేరిన నేపథ్యంలో ఆర్జేడీ ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో త్వరలో ఆరారియా లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనుండంతో రాజకీయ వాతావరణం వేడేక్కింది. మహాబంధన్ కూటమి నుంచి జేడీయు బయటికి వచ్చిన అనంతరం జరిగే మొదటి ఎన్నికలు ఇవే. కాగా జేడీయు మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను , పార్టీ సీనియర్ నేత ఆలీ అన్వర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో రాజ్యసభ స్థానాలు కోల్పోయారు. అయితే వారు ఏపార్టీకి మద్దతు ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో జేడీయు జహాన్‌బాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మిత్రపక్షం బీజేపీని పార్లమెంట్ ,అసెంబ్లీ స్థానంలో బరిలో నిలిపింది. ఈ ఎన్నికలు రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపాయి. -
శరద్ సభ్యత్వం రద్దుపై స్టే కుదరదు’
న్యూఢిల్లీ: జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ సభాధ్యక్షుడు ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన జీతభత్యాలు, బంగళా సహా ఇతర సదుపాయాలన్నీ ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు కొనసాగుతాయని జడ్జి జస్టిస్ విభు బఖ్రు స్పష్టం చేశారు. కేసు తుది విచారణ మార్చి 1న మొదలవనుంది. -
శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వం రద్దు
న్యూఢిల్లీ: జేడీయూ తిరుగుబాటు ఎంపీలు శరద్ యాదవ్, అలీ అన్వర్ల రాజ్యసభ సభ్యత్వం రదై్ధంది. ఈ మేరకు రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన వెలువడింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే ఎన్నికల సంఘం అసలైన జేడీయూగా ఇటీవల గుర్తించిన అనంతరం శరద్, అలీల సభ్యత్వాలు రద్దు కావడం గమనార్హం. వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, రాజ్యసభ నుంచి బహిష్కరించాలని గతంలో జేడీయూ వెంకయ్య నాయుడును కోరడం తెలిసిందే. గతకొన్నేళ్లలో శరద్ యాదవ్ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడం ఇదే తొలిసారి. -
శరద్ యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ
న్యూఢిల్లీ: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) తిరుగుబాటు నేత శరద్ యాదవ్ నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ‘భారతీయ ట్రైబల్ పార్టీ’(బీటీపీ)ని ప్రారంభిస్తామని జేడీయూ శరద్ వర్గం ప్రధాన కార్యదర్శి అరుణ్ మీడియాకు తెలిపారు. బీటీపీ గుర్తుగా ‘ఆటో రిక్షా’ను ఎంపిక చేసుకుంటామన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన రాజశేఖరన్‌ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. -
'ఆర్టికల్ 370ని ఎలా సమీక్షిస్తారండీ?!'
-
వాటి నిర్వాకం వల్లే మూడో కూటమి అవసరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల గందరగోళ విధానాలతో దేశం ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా తృతీయ కూటమిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ తెలిపారు. ఆ కూటమి ఏర్పాటుకు నాయకత్వ అంశం సమస్య కాబోదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశంలో సృష్టించిన పరిస్థితుల వల్ల అవినీతి, నిరుద్యోగం వంటి అసలు సమస్యలు మరుగున పడిపోయాయని, ఏది సరైందో, ఏది సరికాదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. శనివారమిక్కడ వివిధ రాష్ట్రాల జేడీయూ శాఖల నేతలతో సమావేశమైన శరద్ యాదవ్ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మూడో కూటమి ప్రధాని అభ్యర్థి అంశాన్ని ప్రస్తావించగా.. ‘మావెంట లేని ఆ రెండు పార్టీల్లో(కాంగ్రెస్, బీజేపీ) ఆ సమస్య ఉండొచ్చు.. యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మేం వీపీ సింగ్ పేరును ప్రకటించలేదు. ఇప్పుడెందుకు ఆ సమస్య వస్తుంది?’ అని అన్నారు. థర్డ్ ఫ్రంట్‌తో దేశం అధోగతికి చేరుతుందన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆయనకు ప్రధాని కావాలని ఉబలాటంగా ఉంటే ఎర్రకోట నమూనాను వెనక ఉంచుకుని, పీఏ సంగ్మా(ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి) ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసుకోవాలి’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావని, మోడీ ప్రధాని కారని అన్నారు. -
‘బిల్లుపై మా నిర్ణయాన్ని పార్లమెంటులో చెబుతాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో తమ పార్టీ నిర్ణయాన్ని పార్లమెంటులో వెల్లడిస్తామని జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ చెప్పారు. ఆయన శనివారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ చేసిన విభజన తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన నెలకొందన్నారు. బిల్లులోని అంశాలను, రాష్ట్రంలోని పరిస్థితులను చూసి ముందుకు వెళతామని ఆయన చెప్పారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు మూడు రోజులుగా పార్లమెంటు ఉభయ సభలను అడ్డుకోవడాన్ని శరద్ యాదవ్ తప్పుపట్టారు. -
శరద్ యాదవ్‌ను కలిసిన చంద్రబాబు