
న్యూఢిల్లీ: జేడీయూ తిరుగుబాటు ఎంపీలు శరద్ యాదవ్, అలీ అన్వర్‌ల రాజ్యసభ సభ్యత్వం రదై్ధంది. ఈ మేరకు రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన వెలువడింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే ఎన్నికల సంఘం అసలైన జేడీయూగా ఇటీవల గుర్తించిన అనంతరం శరద్, అలీల సభ్యత్వాలు రద్దు కావడం గమనార్హం. వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, రాజ్యసభ నుంచి బహిష్కరించాలని గతంలో జేడీయూ వెంకయ్య నాయుడును కోరడం తెలిసిందే. గతకొన్నేళ్లలో శరద్ యాదవ్ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడం ఇదే తొలిసారి.