Rajya Sabha membership
-
శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వం రద్దు
న్యూఢిల్లీ: జేడీయూ తిరుగుబాటు ఎంపీలు శరద్ యాదవ్, అలీ అన్వర్ల రాజ్యసభ సభ్యత్వం రదై్ధంది. ఈ మేరకు రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన వెలువడింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే ఎన్నికల సంఘం అసలైన జేడీయూగా ఇటీవల గుర్తించిన అనంతరం శరద్, అలీల సభ్యత్వాలు రద్దు కావడం గమనార్హం. వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, రాజ్యసభ నుంచి బహిష్కరించాలని గతంలో జేడీయూ వెంకయ్య నాయుడును కోరడం తెలిసిందే. గతకొన్నేళ్లలో శరద్ యాదవ్ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడం ఇదే తొలిసారి. -
ఆప్‌లో చేరికపై సిద్ధూ మౌనం
చండీగఢ్: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరటంపై నోరు మెదపలేదు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటమంటేనే బీజేపీ నుంచి తప్పుకోవటమేనని ఆయన భార్య నవజోత్ కౌర్ తెలిపారు. సిద్ధూకు ఆప్‌లో చేరటం తప్ప వేరే మార్గం లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఆప్ తరపున పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిద్ధూ పేరును ఇప్పుడే ప్రకటించటం సరైంది కాదని కేజ్రీవాల్ అన్నారు. ‘ఆయనిప్పుడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. మంచివాళ్లంతా బీజేపీని వదిలి రావాలి’ అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, సిద్ధూ, కౌర్ వారం లోగా తమ పార్టీలో చేరతారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆప్‌పై సిద్దూ చేసిన వ్యంగ్యమైన వ్యాఖ్యల వీడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. అదో పెద్ద విషయం కాదన్నారు. -
విజయసాయిరెడ్డికి అభినందనలు
ఇబ్రహీంపట్నం : రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి కృష్ణాజిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ సచివాలయ ప్రాంగణంలో విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి నాయకులు తరలివెళ్లారు. అభినందనలు తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సామినేని ఉదయభాను, గుడివాడ, తిరువూరు, నూజివీడు ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, మేకా ప్రతాప్‌అప్పారావు, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, కైకలూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఉన్నారు. -
సుజనా చౌదరికి చెక్ !
మరోసారి రాజ్యసభ అవకాశం లేనట్లే సాక్షి, హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరికి చెక్ పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెల 21తో ముగియనుంది. ఆయనతోపాటు రాష్ర్టం నుంచి మరో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో టీ డీపీలోని ఆశావహులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరిస్తారని సుజనా చౌదరి ధీమాతో ఉన్నారు. అయితే, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా కొంతకాలంగా బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు వారెంట్ జారీ చేయడం, ఆయన కోర్టులకు హాజరు కావడం, ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పార్టీ నేతలు, ఇతరులు ప్రధానితోపాటు పలు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఫిర్యాదులు, కేసుల దృష్ట్యా సుజనాకు ఈసారి అవకాశం లేనట్లేనని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.